ఎన్టీఆర్ జయంతి: ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి

  • దివంగత ఎన్టీఆర్ 103వ జయంతి 
  • ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ పుష్పాంజలి
  • ఎన్టీఆర్ ఘాట్ పరిసరాల్లో సందడి
  • ‘జై ఎన్టీఆర్’ అంటూ అభిమానుల నినాదాలు
దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవడు, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుష్పాంజలి ఘటించారు.

ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ తన తాత సమాధి వద్దకు చేరుకుని పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన రాకతో అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు 'జై ఎన్టీఆర్' అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎన్టీఆర్ ఘాట్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొనగా, పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

Junior NTR
NTR Jayanthi
Nandamuri Taraka Rama Rao
NTR Ghat Hyderabad
Revanth Reddy
Ammerpet NTR Statue
Telugu Desam Party
Telangana News
Telugu Cinema
NTR 103 Jayanthi

More Telugu News